రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
తెలకపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నరేష్ వివరాల ప్రకారం.. మండలంలోని బండపల్లికి చెందిన గన్నోజు శివకుమార్(27) ఆదివారం తన బైక్‌పై తెలకపల్లికి వచ్చి సాయంత్రం 6 గంటల సమయంలో తిరిగి ఊరికి వెళ్తుండగా, దాసుపల్లి డంపింగ్ యార్డు వద్ద బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో శివకుమార్ తలకు, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి 9 గంటల సమయంలో నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. అతని అన్న నరేష్ సోమవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
బైక్‌పై నుంచి పడి ఇద్దరు యువకుల దుర్మరణం
ఊర్కొండ: బైక్‌పై నుంచి పడి ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన ఊర్కొండ మండలంలోని జడ్చర్ల–కోదాడ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ వీరబాబు వివరాల మేరకు.. కల్వకుర్తి పట్టణంలోని సుభాష్‌నగర్ కాలనీకి చెందిన శ్రీనాథ్ (20), బలరాంనగర్ కాలనీకి చెందిన భాను (21) ద్విచక్ర వాహనంపై జడ్చర్ల వైపు నుంచి కల్వకుర్తికి వెళ్తుండగా.. ఊర్కొండపేట సమీపంలోని కాటన్ మిల్లు వద్ద అదుపుతప్పి కిందపడ్డారు. ప్రమాదంలో వారిద్దరికి తీవ్రగాయా లై అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి మార్చురీకి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
పాముకాటుతో రైతు..
పెద్దకొత్తపల్లి: పాముకాటు వల్ల రైతు మృతి చెందిన సంఘటన సోమవారం పెద్దకారుపాములలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు నాగపురి శివ(28) వ్యవసాయ పొలంలో మినుము పంటకు నీటితడి వేసేందుకు వెళ్లాడు. స్పింకర్ల పైపులు మార్చుతుండగా పాముకాటు వేసింది. చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఆయనకు భార్య హారిక, కూతురు, కుమారుడు ఉన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
హన్వాడ: జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మండలంలోని శేక్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బత్తుల వెంకటయ్య(56) మేసీ్త్ర పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటివల ప్రమాదానికి గురై మానసికంగా బాధపడుతున్నాడు. ఆదివారం రాత్రికి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి ముందున్న టేకు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బత్తుల చెన్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి..
అడ్డాకుల: మండలంలోని తిమ్మాయిపల్లితండాకు చెందిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఏఎస్‌ఐ మనోహర్ తెలిపారు. వివరాలు.. తిమ్మాయిపల్లితండాకు చెందిన పాత్లావత్ గోపాల్(53) కొన్నేళ్ల నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తిచెంది ఆదివారం ఇంటివద్ద గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్సనిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందాడని ఏఎస్‌ఐ తెలిపారు. మృతుడి భార్య పాత్లావత్ చంద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment