యూనియన్ బ్యాంకులో చోరీకి విఫలయత్నం
అమరచింత: వనపర్తి జిల్లా అమరచింత యూనియన్ బ్యాంకులో గుర్తుతెలియని దుండగులు చోరీకి యత్నించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం సాయంత్రం విధులను పూర్తి చేసుకున్న సిబ్బంది బ్యాంక్‌కు తాళంవేసి వెళ్లారు. శని, ఆదివారం రెండు రోజులపాటు సెలవు ఉండటంతో బ్యాంకు పనిచేయలేదు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని దుండగులు బ్యాంకు వెనకి భాగంలోని కిటికీని తొలగించి లోపలికి ప్రవేశించారు. బ్యాంకులోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి.. లాకర్‌ను బద్దలు కొట్టేందుకు విఫలయత్నం చేశారు. లాకర్ ఎంతకు తెరుచుకోకపోవడంతో ఓ కంప్యూటర్ మానిటర్‌తో పాటు సీసీ ఫుటేజీలు రికార్డయ్యే పరికరాన్ని తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. సోమవారం విధులకు హాజరైన బ్యాంకు సిబ్బంది చోరీ ఘటనను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శివకుమార్, క్రైం బ్రాంచ్ సీఐ రవిపాల్, ఎస్‌ఐ నరేష్ బ్యాంక్‌కు చేరుకొని వివరాలు సేకరించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో విచారణ చేపట్టారు. బ్యాంకు మేనేజర్ శివశంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment