అర్జీలను సత్వరమే పరిష్కరించండి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజావాణికి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిరఅధికారులను ఆదేశించా రు. సోమవారం కలెక్టరేట్ సమావేశహాల్‌లో నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అందించిన ఫిర్యాదులు, వినతులను స్థానిక సంస్థల, రెవెన్యూ అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్‌రావుతో కలిసి స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి 82 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. రెవెన్యూ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, ఇతర శాఖలకు సంబంధించి దరఖాస్తులు రాగా వాటిని ఆయా శాఖలకు పంపించి పరిష్కరించాలని ఆదేశించామన్నారు. ప్రజావాణి దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిశీలించి తమపరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని, లేనిచో వారికి తగిన సూచనలు ఇవ్వాల్సిందిగా అధికారులను సూచించారు. అనంతరం వివిధశాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.
స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలి
మహిళలకు వేధింపులు లేని స్వేచ్ఛాయుత పని వాతావరణం కల్పించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. తన చాంబర్‌లో లోకల్ కంప్లైంట్ కమిటీ(ఎల్‌సీసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ మండలస్థాయిలో నోడల్ అధికారిని నియమించి వారి ద్వారా ఫిర్యాదులను ఎల్‌సీసీకి గోప్యంగా అందజేయాలని సూచించారు. మహిళలపై వేధింపులు నివారణ పరిష్కారం చట్టం 2013 ప్రకారం అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో పదిమంది కన్నా ఎక్కువ సిబ్బంది ఉన్నట్లయితే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ(ఐసీసీ) తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఐసీసీ ఏర్పా టు లేనట్లయితే వారి ఫిర్యాదును రూం నంబర్ 36లోని జిల్లా సంక్షేమ అధికారికి అందించవచ్చని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహులు, ఆర్డీఓ నవీన్, అడిషనల్ డీఆర్డీఓ ముషాయిదాబేగం, మహిళాశిశు సంక్షేమ శాఖాధికారి జరీనా బేగం, జిల్లా వైద్యారోగ్య శాఖాధాకారి మాస్‌మీడియా అధికారిణి మంజుల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment