![రెండో రోజూ కొనసాగిన పరిశీలన](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12dvd402-210027_mr-1739413841-0.jpg.webp?itok=zV-UFeDM)
రెండో రోజూ కొనసాగిన పరిశీలన
అడ్డాకుల: అడ్డాకుల మండలం కందూర్, మూసాపేట మండల కేంద్రంలో బుధవారం కేంద్ర సీనియర్ సెక్షన్ అధికారుల బృందం పర్యటన కొనసాగింది. కందూర్‌లో అకింత్‌వర్మ, మదన్‌గోపాల్ భారతి, దీపక్ వర్మ, ఆశీష్ ద్రాలి పర్యటించి పల్లె ప్రకృతివనాన్ని సందర్శించారు. ఉపాధిహామీ కూలీ పనులు చేస్తున్నవారితో అధికారులు మాట్లాడారు. మూసాపేటలో అమిత్‌వర్మ, సోని కుమారి, మీనా కుమారి, మౌనికలు ఎంపీడీఓ, ఎమ్మార్సీ కార్యాలయాన్ని సందర్శించారు. ఎంపీడీఓ కార్యాలయం పనితీరు, ఆసరా పింఛన్లు, వచ్చిన దరఖాస్తులపై ఆరాతీశారు. ఎమ్మార్సీ కార్యాలయంలో పాఠశాలలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం అమలుపై ఆరా తీశారు.
మండల పరిషత్ కార్యాలయంలో..
భూత్పూర్: మండల పరిషత్ కార్యాలయంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్రటరీయల్ ట్రైనింగ్ అండ్ మేనేజ్‌మెంట్ (ఐఎస్‌టీఎం) న్యూఢిల్లీకి చెందిన నలుగురు బృంద సభ్యులు వివిధ గ్రామాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, ప్రజలకు లబ్ధి ఎలా చేకూర్చుతారని సెక్షన్ ఆఫీసర్లు మండల అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిక్షణలో భాగంగా సెంట్రల్ సెక్రటరీట్ సర్వీసెస్( సీఎస్‌ఎస్)కు చెందిన సెక్షన్ ఆఫీసర్లు దీపక్‌మీనా, అరవింద్‌కుమార్, మహ్మద్ ఖాషిఫ్ అన్సారీ, శశికుమార్‌చౌదరి ఏఏ పథకాలు అమలు చేస్తున్నారని, అభివృద్ధి పనులు, తదితర విషయాలపై ఆరాతీశారు. మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో మహిళా సంఘాల వివరాలు, వారికి ఎన్ని రకాలుగా లోన్లు అందజేశారు, తిరిగి చెల్లించే విధానంపై బ్యాంక్ మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రభాకర్, ఎంపీఓ శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ నూరుల్ నజీబ్, ఏపీఓ విమల తదితరులున్నారు.
పలు కార్యాలయాల్లో పనితీరుపై ఆరా
Comments
Please login to add a commentAdd a comment