వనపర్తి: సెల్‌ఫోన్ చోరీ కేసు రుజువైనందున ఓ వ్యక్తికి న్యాయమూర్తి బి.శ్రీలత 6 నెలల 10 రోజుల జైలుశిక్షతో పాటు రూ.వంద జరిమానా విధించినట్లు వనపర్తి డీఎస్పీ జె.వెంకటేశ్వర్‌రావు బుధవారం తెలిపారు. గోపాల్‌పేట మండలం ఏదులకు చెందిన తెలుగు బొక్కలయ్య 2014, ఆగష్టు 1న వనపర్తికి వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు బస్టాండుకు రాగా బస్సు తప్పిపోవడంతో రాత్రి అక్కడే పడుకున్నారు. అర్ధరాత్రి లేచి తన దగ్గరున్న సెల్‌ఫోన్‌లో వీడియోలు చూస్తుండగా పక్కనే ఉన్న కోడేరు మండలం పసుపులకు చెందిన మల్లేశ్ ఫోన్ లాక్కొని అతడిని కిందపడేసి పారిపోయాడు. గాయాలైన బొక్కలయ్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అప్పటి ఎస్‌ఐ జయన్న కేసు నమోదు చేసి మల్లేశ్‌ను అరెస్టు చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. ప్రస్తుత ఎస్‌ఐ హరిప్రసాద్ ఆదేశానుసారం కోర్టు కానిస్టేబుల్ రాజశేఖర్ సాక్షులను ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీతదేవి వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో ఫస్ట్ అడిషనల్ జేఎఫ్‌సీఎం న్యాయమూర్తి బి.శ్రీలత బుధవారం జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరని.. ప్రజలు కూడా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవద్దని డీఎస్పీ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment