![‘ఉదండాపూర్’ పనుల అడ్డగింత](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12zcl01-210041_mr-1739413841-0.jpg.webp?itok=_D3h2uiu)
‘ఉదండాపూర్’ పనుల అడ్డగింత
జడ్చర్ల: మండలంలో కొనసాగుతున్న ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను బుధవారం నిర్వాసితులు అడ్డుకున్నారు. రిజర్వాయర్ కట్ట నిర్మాణ పనులు కొనసాగిస్తున్న యంత్రాల దగ్గరకు వెళ్లి పనులను నిలిపివేయించారు. టిప్పర్లను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తదుపరి రిజర్వాయర్ కట్టపై టెంట్ వేసుకొని ఆందోళనకు దిగారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని పెంచడంతో పాటు వెంటనే తమకు పరిహారాన్ని అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా భూపరిహారాన్ని కూడా అదనంగా చెల్లించాలని కోరారు. 18ఏళ్లు నిండిన యువతకు సైతం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలన్నారు. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాకే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీఐ కమలాకర్, ఎస్‌ఐ శివానందంగౌడ్ ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. నిర్వాసితులతో వారు మాట్లాడి ఆందోళనను విరమించాలని కోరారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునే దిశగా ముందుకెళ్లాలని సూచించారు. మాజీ సర్పంచ్‌లు వెంకటయ్య, శంకరయ్యగౌడ్, మాజీ ఉపసర్పంచ్ శేఖర్, నాయకులు రామక్రిష్ణ, హన్మంతు, శ్రీను, ఆంజనేయులు పాల్గొన్నారు.
సమస్య పరిష్కరించాకే పనులు చేపట్టాలన్న నిర్వాసితులు
Comments
Please login to add a commentAdd a comment