![విద్య](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12acpt403-210009_mr-1739413841-0.jpg.webp?itok=MUOjXWMl)
విద్యార్థి తరగతి గదిలో ఉండగానే తాళం
లింగాల: విద్యార్థి తరగతి గదిలో ఉండగానే ఉపాధ్యాయులు తాళం వేసి వెళ్లిన సంఘటన మండలంలోని శాయిన్‌పేట ప్రాథమికోన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాలిలా.. బుధవారం సాయంత్రం పాఠశాల సమయం అయిపోగానే విద్యార్థులందరూ ఇళ్లకు వెళ్లిపోగా ఉపాధ్యాయులు గదులకు తాళాలు వేసి వెళ్లిపోయారు. అయితే ఒకటో తరగతి విద్యార్థి శరత్ నిద్రపోవడంతో గదిలోనే ఉండిపోయాడు. సాయంత్రం 3:30గంటలకు ఇంటికి రావాల్సి ఉండగా.. 4 గంటలు దాటినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో తండ్రి మల్లేష్ పాఠశాలకు వెళ్లి వెతికాడు. ఈ క్రమంలో ఓ తరగతి గది కిటికి తెరచి చూడగా శరత్ నిద్రించి కనిపించాడు. వెంటనే గది తాళం పగులగొట్టి కుమారుడిని బయటకు తీసుకవచ్చాడు. ఉపాధ్యాయులు గదులకు తాళం వేసే ముందు క్షుణ్ణంగా పరిశీలించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై హెచ్‌ఎం గణేష్ వివరణ ఇస్తూ ప్రతిరోజు 3 గంటలకే స్టడీ అవర్స్ నిర్వహించి విద్యార్థులను బయట కూర్చోపెట్టడం జరుగుతుందన్నారు. శరత్ గదిలో నిద్రించినట్లు గమనించలేదని, ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని చెప్పారు.
![విద్యార్థి తరగతి గదిలో ఉండగానే తాళం
1](https://www.sakshi.com/gallery_images/2025/02/13/12acpt402-210009_mr-1739413842-1.jpg)
విద్యార్థి తరగతి గదిలో ఉండగానే తాళం
Comments
Please login to add a commentAdd a comment