రాష్ట్రస్థాయి టోర్నీలో విజేతగా నిలవాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీలో జిల్లా జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి కురుమూర్తిగౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో బుధవారం జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపికలకు 90 మంది బాలబాలికలు హాజరైనట్లు తెలిపారు. వీరిలో ప్రాబబుల్స్ క్రీడాకారులను ఎంపిక చేశామని, ప్రత్యేక కోచింగ్ క్యాంప్ నిర్వహించి తుది జట్టును తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. వికారాబాద్‌లో ఈనెల 20 నుంచి 23 వరకు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ టోర్నీ ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ సంఘం శ్రీధర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, ఎం.శ్రీనివాసులు, నర్సింలు, కార్యనిర్వాహక కార్యదర్శులు బాల్‌రాజు, పాపారాయుడు, యూ.శ్రీనివాసులు, కె.నర్సింలు, గణేష్, ఆర్.శ్రీనివాసులు, అనురాధ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment