తలసేమియాపై అవగాహన | Sakshi
Sakshi News home page

తలసేమియాపై అవగాహన

Published Mon, May 6 2024 6:35 AM

-

మంచిర్యాలటౌన్‌: తలసేమియా, సికిల్‌సెల్‌ వ్యాధి ని నివారించేందుకు ఆ వ్యాధిపై అందరూ అవగా హన కలిగి ఉండాలని రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ కంకణాల భాస్కర్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో ని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో వాకర్‌ సభ్యులకు తలసేమియా వ్యాధిపై ఆదివారం అవగాహన కల్పించారు. పెళ్లికి ముందు హెచ్‌బీఏ2 రక్త పరీక్షలు చేసుకుని ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. తలసేమియా వ్యాధిగ్రస్తులు హిమోగ్లోబిన్‌ 9.5 గ్రాములు ఉండేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో వాకర్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌ వీరస్వామి, తలసేమియా వెల్ఫేర్‌ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సంయుక్త కార్యదర్శి రంజిత్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement