ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు
ఇచ్చోడ: మండల కేంద్రంలోని సమీర్ ట్రెడర్స్‌లో కరీంనగర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 98 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకొని ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించారు. సంబంధిత వ్యక్తిపై 6ఏ కింద కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి దినేశ్‌రెడ్డి తెలిపారు. ఇందులో విజిలెన్స్ ఏఎస్‌వో ప్రశాంత్‌రావు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ రామారావు తదితరులు ఉన్నారు.
నగదు డిపాజిట్ చేస్తుండగా చోరీ
భైంసాటౌన్: బ్యాంక్‌లో నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ.50 వేలు అపహరించిన ఘటన పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంక్‌లో బుధవారం జరిగింది. పట్టణానికి చెందిన సురేశ్ ఈనెల 11న నిర్మల్ రోడ్ లోని ఎస్బీఐలో రూ.90 వేలు డిపాజిట్ చేసేందుకు రాగా, ఫాం నింపుతున్న క్రమంలో డబ్బు ఉన్న బ్యాగ్‌లోని నగదును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. కొద్ది సేపటికి సురేశ్ బ్యాగు చూడగా, అందులో రూ.50 వేలు కనిపించకపోవడంతో షాక్ అయ్యాడు బ్యాంక్ సీసీ పుటేజ్ పరిశీలించగా ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా తిరిగిన దృశ్యాలు నమోదయ్యాయి. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.
రేషన్ బియ్యం పట్టివేత
కాగజ్‌నగర్‌రూరల్: మండలంలోని కోసిని గ్రామ సమీపంలో బుధవారం మహారాష్ట్రకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన మూడు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు కాగజ్‌నగర్ రూరల్ ఎస్సై మహేందర్ తెలిపారు. పట్టణంలోని సర్‌సిల్క్‌కాలనీకి చెందిన మహ్మద్ ఎక్బాల్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment