రిటైర్డ్ పోలీస్ అధికారుల సమస్యలు పరిష్కరించాలి
● సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏజెల్ల శ్రీనివాస్‌రావు
మంచిర్యాలక్రైం: రిటైర్డ్ పోలీస్ అధికారుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రిటైర్డ్ పోలీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏజెల్ల శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ క్లబ్‌లో జిల్లా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉ ద్యోగ విరమణ పొందిన వారికి ఎంప్లాయిమెంట్ హెల్త్ స్కీంలో ఉన్న స్కీంలను ఎక్కడా అమలు చే యడం లేదన్నారు. ఉద్యోగులకు హెల్త్ స్కీంకు సంబంధించి రూ.800 అలవెన్స్ ఇస్తారని, దానిని రూ. వెయ్యికి పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2024 మార్చి తరువాత నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పీఎఫ్, గ్రాట్యుటీ, ఈఎల్‌ఎం టాక్స్‌మెంట్, గ్రాట్యుటీ కమిషన్‌కు సంబంధించిన నగదు రాక అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏ విడుదల చేయాలని, ఆదాయ పన్ను పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ద్వారా క్యాష్ లెస్ ట్రీ ట్‌మెంట్ అందించాలని డిమాండ్ చేశారు. అన్ని జి ల్లాలో కార్యవర్గాల ఏర్పాటు అనంతరం రాష్ట్ర సమావేశం నిర్వహించి డిమాండ్లను ఎమ్మెల్యే, మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. సమావేశంలో జనరల్ సెక్రెటరీ ఎం.రాజమళ్లరెడ్డి, గౌరవ అధ్యక్షుడు సీహెచ్.రాజమౌళిగౌడ్, ఉపాధ్యక్షుడు టి.వేణుగోపాలస్వామి, సంయుక్త కా ర్యదర్శి ఎండీ.తాహెరుద్దీన్, మంచిర్యాల గౌరవ అ ధ్యక్షుడు జే.నారాయణరావు, ఉమ్మడి ఆది లాబాద్ జిల్లా రిటైర్డ్ పోలీస్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment