తుపాకీతో బెదిరించి చోరీకి యత్నం
లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలోని అడ్డకూరి రమేశ్ అనే వ్యాపారి ఇంటి వద్ద తుపాకీతో బెదిరించి దొంగతనానికి ప్రయత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రమేశ్‌కు చెందిన వైన్స్ దుకాణంలో పనిచేసే లక్ష్మణ్‌గౌడ్ రోజూ దుకాణం బంద్ చేసిన తర్వాత డబ్బులను తీసుకొచ్చి రమేశ్‌కు అప్పగించేవాడు. ఈక్రమంలో సోమవారం రాత్రి దుకాణం మూసేసిన తర్వాత లక్ష్మణ్‌గౌడ్ డబ్బులు తీసుకుని బైక్‌పై వచ్చి రమేశ్ ఇంటిముందు ఆగాడు. అప్పటికే కాచుకొని ముసుగులతో ఉన్న ఇద్దరు దొంగలు లక్ష్మణ్‌ను తుపాకీతో బెదిరించగా తప్పించుకుని ఇంటిలోపలికి పరిగెత్తాడు. వెంటనే దొంగలు బైక్ కీ తీసుకొని స్కూటీపై పారిపోయారు. సీసీఫుటేజీ ఆధారంగా పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై సతీశ్ దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
విషమంగానే శైలజ ఆరోగ్యం
వాంకిడి: హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. శైలజతో పాటు నిమ్స్‌లో చికిత్స పొందిన జ్యోతి, మహాలక్ష్మి పూర్తిగా కోలుకోవడంతో మంగళవారం వారిని డిశ్చార్జ్ చేసినట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. అయితే శైలజ ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను ఫోన్ చేసి తెలుసుకోగా ఆరోగ్యం మెరుగుపడలేదని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. కాగా మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment