సర్వీస్‌బుక్‌లో ఎంట్రీకి లంచం
నిర్మల్: తమ సొంత శాఖలో పనిచేసే బిల్ కలెక్టర్ వివరాలు సర్వీస్ బుక్‌లో నమోదు చేయడానికి కూడా రూ.20 వేలు లంచం అడిగిన ప్రభుద్ధుడు రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటన నిర్మల్‌లో బుధవారం జరిగింది. నిర్మల్ మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్ షాకీర్‌ఖాన్ బిల్ కలెక్టర్ నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బుధవారం పట్టుకున్నారు. కరీంనగర్ డివిజన్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, బాధితుడు భరత్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాకేంద్రానికి చెందిన భరత్ కారుణ్య నియామకం కింద నిర్మల్ మున్సిపల్‌లో బిల్‌కలెక్టర్‌గా నియామకమయ్యాడు. ఉద్యోగ వివరాలను సర్వీస్‌బుక్‌లో ఎంట్రీ చేయాల్సి ఉంది. ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్ చూసే షాకీర్‌ఖాన్ తనకు రూ.20 వేలు ఇస్తేనే పనిచేస్తానని చెప్పాడు. రెండు నెలలుగా భరత్ బతిమాలుతున్నా పట్టించుకోలేదు. చివరకు రూ.15 వేలు ఇస్తేనే చేస్తానని చెప్పడంతో అంగీకరించాడు. దీంతో భరత్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం ఉదయం బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భరత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కొనసాగుతున్న కౌన్సెలింగ్
నస్పూర్: సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు సర్ఫేస్‌లో గల 16 డజిగ్నేషన్‌లలో ఉద్యోగాలపై ఇస్తున్న కౌన్సెలింగ్ బుధవారం కొనసాగింది. కౌన్సెలింగ్‌లో మొత్తం 85 మంది మహిళా బదిలీ వర్కర్లు జనరల్ మజ్దూర్లుగా ఎంపికయ్యారు. కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం శ్రీధర్‌రావు, డీవైసీఎంవో రమేశ్‌బాబు, ఎస్‌ఈ కిరణ్‌కుమార్, అధికారులు కాంతారావు, మల్లయ్య, రవీందర్, చంద్రలింగం, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment