పురుగుల మందు తాగి ఒకరి ఆత్మహత్య
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): జైనథ్ మండలంలోని దీపాయిగూడ గ్రామానికి చెందిన మావురపు జీవన్ (45) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్సై ఆత్మారాం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. జీవన్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీరుతాయో లేదోనని మనస్తాపానికి గురైన ఆయన మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గ్రామ శివారులో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
మహారాష్ట్రకు చెందిన ఒకరు..
మహారాష్ట్రలోని పటోర గ్రామానికి చెందిన మనోజ్ (35) మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందినట్లు టూటౌన్ ఏఎస్సై ముకుంద్‌రావు తెలిపారు. ఐదెకరాల్లో పత్తి పంట సాగు చేయగా, పంట ఎదుగుదల లేకపోవడంతో దిగాలు చెందాడు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు.
బాలికపై అత్యాచార యత్నం
మంచిర్యాలక్రైం: బాలికపై అత్యాచారానికి యత్నించిన ఓ వ్యక్తిపై బుధవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీకి చెందిన రాజేందర్ బాలిక(11)కు మంగళవారం రాత్రి మాయమాటలు చెప్పి హైటెక్ సిటీ సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లాడని పేర్కొన్నారు. అత్యాచారానికి యత్నించాడని బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఘనంగా గోదావరి హారతి
బాసర : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో గోదావరి హారతిని బుధవారం సాయింత్ర ం ఘనంగా నిర్వహించారు. నదీ తీరానగల సూర్యేశ్వరస్వామి ఆలయంలో వైదిక బృందం జ్వాలాతోరణ కార్యక్రమం ముందుగా నిర్వహించారు. అనంతరం అర్చకులు నదికి హారతి ఇచ్చారు. భక్తులు హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment