మద్యం అనుకొని గడ్డిమందు తాగి వ్యక్తి మృతి
ముధోల్: మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఇంట్లో ఉన్న గడ్డి మందును మద్యం అనుకొని తాగి మృతి చెందిన సంఘటన మండలంలోని కారేగాంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రపదేశ్‌కు చెందిన ఇజ్రాయిలు (42) తన భార్య మరియమ్మతో కలిసి భవన కూలీగా జీవిస్తూ ముధోల్ మండలం కారేగాంలోని అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గురువారం మద్యం తాగి ఇంటికి వచ్చిన ఇజ్రాయిలు మద్యం మత్తులో అద్దె ఇంట్లో ఉన్న గడ్డిమందును మద్యం అనుకొని తాగి విషయాన్ని భార్యకు చెప్పాడు. అనుమానం వచ్చిన భార్య మరియమ్మ గడ్డిమందు సీసాను ఇంటి యజమానికి చూపించగా గడ్డిమందు అని ఆయన తెలపడంతో వెంటనే ఇజ్రాయిలును భైంసా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరియమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లేశ్ పేర్కొన్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
వేటగాళ్ల ఉచ్చుకు గేదెలు బలి
మందమర్రిరూరల్: మండలంలోని దుబ్బపల్లి సమీపంలో విద్యుత్ తీగలు అమర్చిన వేటగాళ్ల ఉచ్చుకు తగిలి గేదెలు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మందమర్రిలోని షిర్కే నివాసి ఇందూరి శంకర్‌కు చెందిన రెండు గేదెలు బుధవారం ఉదయం మేతకోసం వెళ్లాయి. గేదెలు ఇంటికి తిరిగి రాకపోవడంతో గాలించాడు. శుక్రవారం దుబ్బపల్లి సమీపంలో గేదెలు విద్యుత్ తీగలకు తగిలి మృతి చెందాయి. గేదెల విలువ సుమారు. రూ.2లక్షల వరకు ఉంటుందని బాధితుడు శంకర్ తెలిపారు. వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చిన ప్రాంతంలో గేదెలతో పాటు మరికొన్ని జీవాలు కూడా మృతి చెందిన ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఎఫ్‌బీవో రాజేశ్వరిని వివరణ కోరగా తనకు సమాచారం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment