రోడ్డు ప్రమాదాలు.. పలువురికి గాయాలు
బైక్ అదుపుతప్పడంతో..
తిర్యాణి: ద్విచక్రవాహనం అదుపుతప్పి ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మొర్రిగూడ పంచాయతీ పరిధిలోని లచ్చుగూడ గ్రామానికి చెందిన కోర్పెత తిరుమన్‌రావు బైక్‌పై తిర్యాణి నుంచి మొర్రిగూడ వైపునకు వెళ్తుండగా పాత సమ్మక్క గద్దల వద్ద బైక్ అదుపుతప్పి కిందపడటంతో ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ముధోల్‌లో..
ముధోల్: మండల కేంద్రంలో శుక్రవారం బైక్ అదుపుతప్పి ఒకరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బ్రహ్మన్‌గావ్ గ్రామానికి చెందిన భూమన్న అనే వ్యక్తి ముధోల్ వైపునకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మార్గమధ్యలో ఐసీడీఎస్ కార్యాలయం సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడిపోయాడు. ప్రమాదంలో భూమన్నకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించగా, అంబులెన్సు టెక్నిషియన్ మాధవ్, ఫైలట్ గౌతమ్‌లు సంఘటన స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం భైంసా ఏరియాసుపత్రికి తరలించారు.
ఆటో ఢీ కొట్టడంతో ఒకరికి..
ముధోల్: మండలంలోని బాసర –భైంసా ప్రధాన రహదారిపై చార్‌బాయి బీడీ కంపెనీ సమీపంలో ఆటో ఢీకొన్న సంఘటనలో మహిళకు తీవ్ర గాయాలైనట్లు సీఐ మల్లేశ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. బాసర మండల కేంద్రానికి చెందిన లక్ష్మి గురువారం రాత్రి నడుచుకుంటూ బాసర వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీ కొట్టింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలై కాలు విరిగిపోయింది. గమనించిన స్థానికులు పోలీసులకు, 108కు సమాచారం అందించారు. వెంటనే అంబులెన్స్‌లో లక్ష్మిని భైంసా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు బాధితురాలి భర్త ముత్తన్న తెలిపారు. ముత్తన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment