● పకడ్బందీగా ఏర్పాట్లు ● అర గంట ముందే గేట్ల మూసివేత
గంట ముందే చేరుకోవాలి..
అభ్యర్థులు గంట ముందే చేరుకోవాలి. హాల్ టికెట్, ఒరిజనల్ ఫొటో ఐడెంటీ కార్డు(ఆధార్‌కార్డు, పాన్, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు గుర్తింపు కార్డు) వెంట తీసుకరావాలి. మొబైల్‌ఫోన్లు, డిజిటల్ చేతివాచ్‌లు, బ్లూటూత్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు లోపలికి అనుమతించం.
– జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్‌సీ) గ్రూప్–3 పరీక్ష ఈ నెల 17, 18న నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికారులు అ న్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 15,038 మంది అభ్యర్థులు పరీక్ష రాయనుండగా.. మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్, మందమర్రిలో మొత్తంగా 48 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం సా యంత్రమే పరీక్ష సామగ్రి స్ట్రాంగ్ రూంలకు చేరుకున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచనున్నారు. పరీ క్షల నిర్వహణకు నోడల్ అధికారిగా జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, పోలీసు నోడల్ అధికారిగా బె ల్లంపల్లి ఏఆర్ ఏసీపీ సురేందర్, రీజినల్ కోఆర్డినేటర్‌గా నరేందర్‌రెడ్డిలను నియమించారు. ముఖ్య ప ర్యవేక్షకులు 48మందిని, అబ్జర్వర్లు 49మందిని, రూట్ ఆఫీసర్లు 9మందిని, ఫ్లయింగ్ స్క్వాడ్ 16 మందిని, ఐడెంటిఫికేషన్ అధికారులు 48మందిని నియమించారు. ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐ లు, 48మంది ఎస్సైలు, 150మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, అరగంట ముందే గేట్లు మూసి వేస్తామని అధికారులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment