‘అనర్హులైన గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇవ్వద్దు’
తాండూర్: అనర్హులైన గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇవ్వడం ఏమాత్రం సరికాదని కొలవా ర్ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండిగ రవీందర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏళ్ల తరబడిగా పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పోడు పట్టా లు ఇవ్వడానికి సతాయించిన అధికారులు గిరి జనేతరులను అర్హులుగా ఎలా గుర్తించారో చె ప్పాలని ప్రశ్నించారు. గిరిజనేతరులను గిరిజ నులుగా చూపించి అక్రమాలకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారు. వారి ప ట్టాలను రద్దు చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎ త్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించా రు. ఈ సమావేశంలో మండల తుడుందెబ్బ ప్రధాన కార్యదర్శి యాపల సమ్మయ్య, ఉపాధ్యక్షుడు ఊరడి మహేష్, మాజీ సర్పంచ్ మణికుమార్, నాయకులు చిలకయ్య, చిన్నయ్య, ప్రవీణ్, హన్మంతు, రాజయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment