పట్టుదలగా ‘కొలువు’దీరారు..
నిరుపేదలు.. వ్యవసాయ కుటుంబం.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారు మరికొందరు.. అయితేనేం.. పట్టుదలగా చదివి గ్రూప్–4 ఉద్యోగాలు సాధించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి శభాష్ అనిపించుకున్నారు. టీజీపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో ఉద్యోగాలు సాధించిన జిల్లా వాసులపై ప్రత్యేక కథనం.
కోటపల్లి/చెన్నూర్‌రూరల్/బెల్లంపల్లి: కోటపల్లి మండలం సుపాక గ్రామానికి చెందిన అగ్గు సత్త య్య, పద్మ దంపతుల కూతురు స్వాతి ప్రతిభ కనబర్చి జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాఽ దించింది. నిరుపేద కుటుంబానికి చెందిన స్వాతి విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాలలోనే సాగించింది.
● కోటపల్లికి చెందిన కొట్టె సాయికిరణ్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగ పరీక్షలు రాసినా కొద్ది మార్కుల తేడాతో ఉద్యోగం పొందలేదు. నిరాశ చెందకుండా గ్రూప్–4 పరీక్ష రాసి వార్డు ఆఫీసర్ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం గ్రూప్–3 పరీక్షకు సిద్ధమవుతున్నాడు.
● కోటపల్లి మండలం శెట్‌పల్లి గ్రామానికి చెందిన చేతన్ బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తండ్రి లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ చదివించాడు. చేతన్ ప్రస్తుతం మండలంలోని జనగామ గ్రామంలో పోస్టల్ డిపార్టుమెంట్‌లో బీపీఎంగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
● చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన బుర్ర శ్రీకాంత్‌గౌడ్ ఐటీడీఏలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.
● బెల్లంపల్లి మండలంలోని మాల గురిజాల గ్రామానికి చెందిన గోనే శశికుమార్ ఉద్యో గం సాధించాడు. బీటెక్ పూర్తి చేశానని, రోజు కు 8గంటలపాటు చదివానని తెలిపాడు.
లక్సెట్టిపేట: పట్టణంలోని మహాలక్ష్మివాడకు చెందిన కూడెల్లి తేజకళ్యాణి వార్డు ఆఫీసర్ ఉద్యోగం సాధించింది.
యువరైతు 68వ ర్యాంకు
జన్నారం: మండలానికి చెందిన ఏడుగురు యువకులు ఉద్యోగాలు సాధించారు. మండలంలోని కవ్వాల్ హాస్టల్ తండా గ్రామానికి చెందిన యువరైతు లాకవత్ రాజు జిల్లా స్థాయిలో 68వ ర్యాంకు సాధించాడు. రేండ్లగూడ గ్రామానికి చెందిన మామిడిపెల్లి రామన్ జిల్లాస్థాయి 223వ ర్యాంకు సాధించాడు. పొనకల్‌కు చెందిన నగూరి అనిల్‌కుమార్, మహ్మదబాద్‌కు చెందిన జాడి రాజతిరుపతి, మురిమడుగు గ్రామానికి చెందిన ఎలగందుల మధుకర్, దేవునిగూడ గ్రామానికి చెందిన సింగిరెడ్డి రణదీప్‌రెడ్డి, తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కుక్కటికారి దుర్గప్రసాద్ ఉద్యోగం సాధించారు.
దండేపల్లిలో..
దండేపల్లి: మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ టీచర్ పాత రమేష్, కేసరి దంపతుల ఇద్దరు కుమారులు దినేష్, విష్ణువర్ధన్ హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ హార్టీకల్చర్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు సాధించారు. బొలిశెట్టి సచిన్‌రాహుల్ ఆడిట్ అండ్ జనరల్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా, మధు ట్రెజరీలో జూనియర్ అసిస్టెంట్‌గా, మండలంలోని నెల్కివెంకటాపూర్‌కు చెందిన అయ్యోరు శ్వేత విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగాలు సాధించారు.
అక్కాచెల్లెలు
మంచిర్యాలటౌన్: మంచిర్యాలలోని పాతమంచిర్యాలకు చెందిన ధరణి రాంచందర్, అనిత దంపతుల ఇద్దరు కూతుళ్లూ ఉద్యోగాలు సాధించారు. రాంచందర్ మందమర్రి మండలం అందుగులపేట సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తూ కూతుళ్లను పీజీ వరకు చదివించారు. పెద్ద కూతురు అలేఖ్య నిజాం కాలేజీలో ఎంకాం, చిన్న కూతురు అమూల్య ఓయూ క్యాంపస్‌లో ఎ మ్మెస్సీ ఇటీవలే పూర్తి చేశారు. మొదటిసారి రాసి న పరీక్షలో ఉద్యోగాలు సాధించారు. అలేఖ్య జి ల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకులంలో, అమూల్య మున్సిపల్ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా ఎంపికయ్యారు. ఇద్దరూ ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో తల్లిదండ్రుల్లో ఆనందం నెలకొంది.
● మంచిర్యాల పట్టణంలోని మేదరివాడకు చెందిన నీలం వెంకటేశ్ ము న్సిపాలిటీలో జూనియర్ అకౌంటెంట్‌గా ఉ ద్యోగం సాధించాడు. 2018లో తండ్రి భీమ య్య మృతిచెందగా.. తల్లి మధునక్కకు అండగా ఉండి పనులు చేసుకుంటూ ఎంబీఏ చ దివాడు. శిక్షణ పొంది గ్రూప్–2 రాసినా ఫలి తం లేకపోయింది. ఇంట్లోనే ఉంటూ పరీక్షకు సన్నద్ధమై గ్రూప్–4 ఉద్యోగం సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment