● గూడెంలో పోటెత్తిన భక్తులు ● 1490 సామూహిక సత్యనారాయణవ్
దండేపల్లి/మంచిర్యాలరఅర్బన్: కార్తిక పౌర్ణమి జాతర సందర్భంగా దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయానికి శుక్రవారం భక్తజనం పోటెత్తింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల నుంచి భారీసంఖ్యలో తర లి రావడంతో సందడిగా మారింది. ఘాట్ రోడ్డు గుండా ప్రధాన ఆలయం వరకు క్యూలైన్లలో భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరి సత్యదేవుణ్ని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. సింహద్వారం నుంచి మెట్ల దారి వరకు, ఘాట్ రోడ్డు మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయాయి. సన్నిధి సమీపంలోని రావిచెట్టు వద్ద భక్తులు కార్తిక దీపాలు వెలిగించారు. 1490 జంటలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నోముకున్నారు. కలెక్టర్ కుమా ర్ దీపక్, వరంగల్ జైళ్ల శాఖ డీఐజీ సంపత్, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు స్వామి వారిని దర్శించుకున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, సురేఖ దంపతులు, మంచిర్యాల డీసీపీ భాస్కర్ దంపతులు సత్యనారాయణ వ్రతాలు నోముకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగ తం పలుకగా, అర్చకులు ఆశీర్వచనం చేసి ప్రసాదా లు అందించా రు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో శ్రీనివాస్, సిబ్బంది, లక్సెట్టిపేట సీఐ నరేందర్, ఎస్సైలు, సుమారు 200 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. భక్తులు గూడెం గోదా వరి నదిలో స్నానాలు ఆచరించారు. గంగమ్మతల్లికి పూజలతోపాటు కార్తిక దీపాలను నదిలో వదిలారు. నదివద్ద స్నానాలు చేసే మహిళా భక్తులకు సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురయ్యారు. మంచిర్యాల పట్టణంలోని ఆలయాలన్ని భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయాయి. ధ్వజస్తంభాలు, ఉసిరిచెట్ల వద్ద దీపారాధనలు చేసి తరించారు. స్థానిక విశ్వనాథ ఆలయంలో వెంకటేశ్వరస్వామి, శివాల యం, వాసవి కన్యకపరమేశ్వరి మాతాను దర్శించకునేందుకు భక్తులు బారులు తీరారు. శివలింగానికి పాలాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు.
విశ్వనాథ ఆలయంలో దీపాలు వెలిగిస్తున్న భక్తులు
కార్తిక..
జాతర
Comments
Please login to add a commentAdd a comment