ప్రయాణికుల సమస్యలు పరిష్కరిస్తాం
మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ ప్రయాణికుల స మస్యలు పరిష్కరిస్తామని మంచిర్యాల డిపో మేనేజర్ జనార్దన్ అన్నారు. శుక్రవారం ని ర్వహించిన డయల్ యువర్ డీఎంలో ప్రయాణికుల సమస్యలు విని పరిష్కారానికి సానుకూలంగా స్పందించా రు. మియాపూర్ నుంచి మంచిర్యాలకు సా యంత్రం 6గంటలకు బస్సు సర్వీసు నడిపించాలని నరేందర్ కోరగా పరిశీలిస్తానని డీఎం అన్నారు. మందమర్రికి చెందిన సుధాకర్ మంచిర్యాల నుంచి వచ్చే బస్సులను మందమర్రి మార్కెట్ బస్టాండ్ వరకు వచ్చేలా చూడాలని సూచించగా.. మంచిర్యాల డిపో బస్సులు రెండు నడుస్తున్నాయని చెప్పారు. మునిమడుగు కు చెందిన రాంచంద్రారెడ్డి వేములవాడ వయా జన్నారం కలమడుగు, జగిత్యాల వరకు బస్సులు నడిపాలని కోరగా ప్రయత్నిస్తానని అన్నా రు. బెల్లంపల్లికి చెందిన శ్రీనివాస్ కాళేశ్వరం నుంచి బెల్లంపల్లి కాంటా వరకు బస్సు సౌకర్యం కల్పించాలని విన్నవించగా.. పరిశీలిస్తామని తెలిపారు. వేమనపల్లి, కన్నెపల్లి, బెల్లంపల్లి బస్సు పునరుద్ధరించాలని సంతోష్, నాగసతీష్‌కుమార్ డీఎం దృష్టికి తీసుకు రాగా రూట్ సర్వే చేసి బస్సు నడిపిస్తామని చెప్పారు. హైటె క్ కాలనీ మంచిర్యాలకు చెందిన రాజేశ్ సా యంత్రం 8గంటలకు నిర్మల్ నుంచి మంచిర్యాలకు బస్సు సర్వీసు వేయాలని, బెల్లంపల్లికి చెందిన శ్రీనివాస్ బెల్లంపల్లి దేవాపూర్‌కు బ స్సు నడిపించాలని కోరగా సానుకూలత వ్య క్తం చేశారు. ఆయా రూట్లలో సర్వే చేసిన అనంతరం బస్సులు నడిపిస్తామని డీఎం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment