సరిహద్దులో పోలీసుల నిఘా
వేమనపల్లి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రాణహిత నది తీరం వెంట పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నీల్వాయి ఎస్సై శ్యాంపటేల్ వేమనపల్లి పుష్కరఘాట్, రాచర్ల, కళ్లెంపల్లి ఫెర్రీ పాయింట్లను సందర్శించారు. ప్రయాణికుల వివరాలు, ఆధార్‌కార్డు, ఇతర గుర్తింపు కార్డులు తనిఖీ చేసి ఎటు వెళ్తున్నారు, ఏయే సామగ్రి తీసుకెళ్తున్నారని సోదాలు చేశారు. తెలంగాణ–మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రాణహిత నది సరిహద్దుగా ఉంది. గడ్చిరోలి, చంద్రాపూర్, యావత్మాల్ జిల్లాల్లో కూడా సరిహద్దులే ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాలు కావడం, పైగా మావోయిస్టు షెల్టర్ జోన్‌గా పేరుంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో నిఘా ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment