జన్నారం/ దండెపల్లి: అడవిలో అగ్ని ప్రమాదాలు జరుగకుండా అటవీశాఖకు సహకరించాలని జన్నా రం డివిజన్‌లోని మూడు అటవీ రేంజ్ పరిధిలో అటవీశాఖ అధికారులు సమీప గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించారు. జన్నారం, ఇందన్‌పల్లి, అటవి రేంజ్ అధికారులు సుష్మారావు, కారం శ్రీనివాస్ ఆదేశాల మేరకు కొత్తపేట, కొలాంగూడ, బంగారు తండా, హాస్టల్ తండా, దండేపల్లి మండలం కుదేల్‌పాడ్, తానిమడుగు గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. అడవుల కు వెళ్లే సమయంలో అగ్గిపెట్టె, బీడీ లాంటివి తీసుకెళ్లొద్దని సూచించారు. అడవిలో అగ్ని ప్రమాదం జరిగితే వన్యప్రాణులు , పక్షులు మృతిచెందుతాయన్నారు. పులి సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వన్యప్రాణులకు ఎలాంటి ఆటంకం, ప్రమాదం కల్పించొద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో సెక్షన్ అధికారులు కృష్ణారావు, హన్మంతరావులు, బీట్ అధికారులు ప్రణయ్‌కుమార్, అమృతరావు, బానయ్య, రుబీనా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment