ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలి
● కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: వివిధ సమస్యపై ప్రజావా ణికి వచ్చిన దరఖాస్తులను అధికారులు సమన్వయంతో త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మంచి ర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణతో కలిసి ఆర్జీలు స్వీకరించారు. చెన్నూర్ మున్సి పాలిటీకి చెందిన మెప్మా రిసోర్స్ పర్సన్స్ తమకు రావాల్సిన గౌరవ వేతనం 7 నెలలుగా అందడం లేదని, వేతనంతోపాటు డ్రెస్ కోడ్ ఇప్పించాలని, సమావేశ గది, కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతూ ఆర్జీ సమర్పించారు. దండేపల్లి మండలా నికి చెందిన తరాల కాంతయ్య తన తండ్రి పేరిట గల భూమిని పార్టిషన్ చేయాలని జారీ చేసిన సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఉత్తర్వులు అమలు చేయాలని దరఖాస్తు అందజేశారు. బెల్లంపల్లి మండలం చంద్రవెళ్లి గ్రామానికి చెందిన ఇర్సుల భీమయ్య తనకు భీమిని శివారులో గల భూమిని బ్లాక్ లిస్టు నుంచి తీసివేయాలని దరఖాస్తు అందజేశారు. వీఆర్వోల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు తమ దరఖాస్తులో జీవో 81 ప్రకారం 61 సంవత్సరాలు వయసు పైబడిన వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాలు ఇప్పించాలని కోరారు. కన్నెపల్లి మండలం మెట్‌పల్లి గ్రామానికి చెందిన మడుగుల కుమార్ తాను గ్రామ శివారులోని భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం స్టాల్ బుక్ చేసుకున్నానని, ఈభూమి రిజిస్ట్రేషన్ కానందున స్టాల్ రద్దు చేశానని, సంబంధిత నగదు ఇప్పించాలని అర్జీ పెట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment