సీఎం కప్ పోటీల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
● జిల్లా యువజన క్రీడల అధికారి కీర్తి రాజవీరు
మంచిర్యాలఅగ్రికల్చర్: సీఎం కప్ పోటీల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా యువజన క్రీడా అధికారి కీర్తి రాజవీరు అన్నారు. కలెక్టరేట్ సమావే శ మందిరంలో జిల్లాలో నిర్వహించే సీఎం కప్ పో టీలపై జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఒలింపిక్ కార్యదర్శి పి.రఘునాథ్‌రెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులు, వివిధ క్రీడాంశాల ప్రతినిధులు, పీఈ టీలు, పీడీలు, సీనియర్ క్రీడాకారులతో సోమవా రం సమీక్ష నిర్వహించారు. జిల్లా యువజన క్రీడల అధికారి మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు సీఎం కప్ 2024లో భాగంగా ఈ నెల 7, 8 తేదీల్లో గ్రామ స్థాయి, 10 నుంచి 12 తేదీ వరకు మండలస్థాయి, 16 నుంచి 21 తేదీ వరకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆయా స్థాయిలలో ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని డిసెంబర్ 27 నుంచి 2025, జనవరి 2, వరకు జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని వివరించారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలు, వెనబడిన తరగతులు, గిరిజన, మైనార్టీ సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలు, ఎంజేపీ, మోడల్, కస్తూరిబా గాంధీ విద్యాలయాల పిల్లల్లో ఆసక్తి గల వారు పాల్గొనే విధంగా ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులు క్రీడాంశం వివరాలను cmcu p2024.telangana.gov.in పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఆ దిశగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపా రు. అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివిధ అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఒలింపిక్ వైస్ ప్రెసిడెంట్ కె.రమేశ్, కబడ్డీ కార్యదర్శి రాంచందర్, ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment