కలెక్టర్ గారూ.. న్యాయం చేయండి
మంచిర్యాలఅగ్రికల్చర్: మంచిర్యాల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వ చ్చిన ఓ దివ్యాంగుడు కలెక్టర్ కాళ్లపై పడి న్యాయం చేయాలని వేడుకున్నాడు. అర్జీ పెట్టుకునేందుకు దివ్యాంగుడు మల్లేశ్ రాగా, కలెక్టర్ కుమార్ దీపక్ వేదికపై నుంచి అతని వద్దకు వ చ్చాడు. ఈ సందర్భంగా మల్లేశ్ తన ఆవేదన ను వ్యక్తం చేశాడు. తాను, తన భార్య దివ్యాంగులమని, మంచిర్యాల తిలక్‌నగర్‌లోని ది వ్యాంగుల కాలనీలోని క్వార్టర్‌లో 12 ఏళ్లుగా ని వాసం ఉంటున్నామని తెలిపారు. అప్పటి కలెక్టర్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉంటున్న ఇళ్ల కు ఇంటి నంబర్, నల్లా కనెక్షన్ కూడా ఇప్పించారని తెలిపారు. అప్పటి నుంచి ఇంటి పన్ను, కరెంట్, నల్లా బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. ఇప్పుడు గట్టయ్య అనే వ్యక్తి నా పేరుమీద ఈ భూమి పట్టా ఉందని ఇంటి నుంచి బయటకు వెళ్లాలని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అతనిపై చర్య తీసుకొని న్యాయం చేయాలని కాళ్లు పట్టుకోబోయాడు. దూరం జరిగిన కలెక్టర్ వినతిపత్రం తీసుకొని సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment