కాగజ్‌నగర్‌రూరల్: మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న పశువుల వ్యాన్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం కాగజ్‌నగర్ మండలంలోని వంజీరి గ్రామసమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా బోలెరో మాక్స్ వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 9 పశువులను పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. పశువుల అక్రమ రవాణాకు పా ల్పడిన వాంకిడి మండలంలోని గోయగాం గ్రామానికి చెందిన సద్దాం సర్పుద్దీన్ అనే డ్రైవర్‌తోపాటు మహారాష్ట్రకు చెందిన బోడ మంగేశ్ నరసింహ, వ్యాన్ ఓనర్ అజీమ్ షాదుల్‌షేక్, హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ రియాజ్ ఖురేషిలను పట్టుకుని కాగజ్‌నగర్‌రూరల్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో ఎస్సై వెంకటేశ్, సిబ్బంది రమేశ్, మధు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment