బెల్లంపల్లిరూరల్: బెల్లంపల్లి మున్సిపాలిటీ కాల్‌టెక్స్‌కు చెందిన పదమూడేళ్ల బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించి వేధింపులకు గురి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ ఎస్సై మహేందర్ తెలిపారు. కాల్‌టెక్స్‌కు చెందిన బాలిక స్కూల్‌కు వెళ్లే క్రమంలో సుబ్బారావు పల్లెకు చెందిన రాస వెంకటేశ్ అనే వ్యక్తి ప్రేమించానని వెంటపడి మూడు రోజుల క్రితం బాలిక చేయి పట్టుకొని తన బైక్‌పై ఎక్కాలని బలవంతం చేశాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే చంపుతామని బెదిరించాడు. బాలిక జరిగిన విషయాన్ని తల్లికి తెలుపడంతో తల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని సోమవారం వెంకటేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్సై తెలిపారు.
సెల్‌ఫోన్ దొంగ రిమాండ్
ఆదిలాబాద్‌టౌన్: సెల్‌ఫోన్ చోరీకి పాల్పడిన మహారాష్ట్రకు చెందిన నూర్‌సింగ్ రాథోడ్‌ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గతనెల 29న అంబేద్కర్ చౌక్‌లో చాయ్ తాగుతున్న వ్యక్తి నుంచి సెల్‌ఫోన్ దొంగిలించి నూర్‌సింగ్ ఇతరులకు విక్రయించాడు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. సెల్‌ఫోన్‌ను రికవరీ చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment