పులి పాదముద్రలపై పుకార్లు
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని జంబుల్‌ధరి, రాములుగూడ శివారు ప్రాంతాల్లో పులి అడుగులు కన్పించాయంటూ వదంతులు వ్యాప్తి చెందాయి. కొంత మంది రైతులు సోమవారం వ్యవసాయ పొలాలకు వెళ్లగా హైనా అడుగులు చూసి పులి అడుగులుగా భావించి భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. సమాచారం తెలుసుకున్న బీట్ అధికారి ప్రీతం సిబ్బంది, రైతులతో కలిసి వ్యవసాయ పొలాల్లో పర్యటించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఆయన వాటిని హైనా అడుగులుగా గుర్తించారు. ఆయన మాట్లాడుతూ మండల శివారు ప్రాంతాల్లో పులి సంచారం లేదని, ఎవరూ పుకార్లు నమ్మవద్దన్నారు. పుకార్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment