● రూ.70 లక్షల విలువైన మొక్కలు స్వాధీనం ● నిందితుల అరెస్టు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకీ షర్మిల | - | Sakshi
Sakshi News home page

● రూ.70 లక్షల విలువైన మొక్కలు స్వాధీనం ● నిందితుల అరెస్టు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకీ షర్మిల

Published Tue, Dec 3 2024 12:41 AM | Last Updated on Tue, Dec 3 2024 12:41 AM

● రూ.

● రూ.70 లక్షల విలువైన మొక్కలు స్వాధీనం ● నిందితుల అరెస్

నిర్మల్‌టౌన్‌: వ్యవసాయ భూమిలో గంజాయి సాగుచేస్తున్న వారిని అరెస్టు చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పో లీస్‌ కార్యాలయంలో సోమవారం వివరాలు వె ల్లడించారు. కడెం మండలం మంగల్‌సింగ్‌ తండా కు చెందిన టకాడ ఇందల్‌, కసావత్‌ సజన్‌ లాల్‌, గోతి రవీందర్‌, కచ్‌కాద్‌ సంతోష్‌, భామనే సురేందర్‌, పేలియ ప్రతాప్‌ సింగ్‌ అల్లంపల్లి పరిసర ప్రాంతాల్లోని బాబానాయక్‌ తండా గ్రామ శివారులో గంజాయి సాగు చేస్తున్నారు. టకాడ ఇందల్‌ తండ్రి హరిచంద్‌ పేరు మీద ఉన్న ఐదున్నర ఎకరాల భూమిలో పత్తి, తొగరు పంటతోపాటు గంజాయి సాగు చేస్తుండగా, పక్కా సమాచారం మేరకు ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందం సోమవారం తెల్లవారుజామున దాడి చేశారు. ఇందల్‌ పారిపో యే ప్రయత్నం చేయగా వెంబడించి పట్టుకున్నారు. 83 గంజాయి మొక్కలు గుర్తించి వాటిని తూకం వే యగా 46.64 కిలోలుగా తేలాయి. వాటి విలువ రూ.41,50,000గా అంచనా వేశారు. ఇందల్‌ను వి చారించగా గ్రామంలో మరో ఐదుగురు గంజాయి సాగు చేస్తున్నట్లు తెలిపాడు. కసావత్‌ సజన్‌లాల్‌ వ్యవసాయ భూమిలో రూ.లక్ష విలువైన 400 గ్రా ముల గంజాయి మొక్కలు, గోతి రవీందర్‌ చేనులో రూ.4 లక్షల విలువైన 2.53 కిలోల 8 గంజాయి మొక్కలు, కచ్‌కాద్‌ సంతోష్‌ చేనులో రూ.8 లక్షల వి లువైన 3.49 కిలోల 16 గంజాయి మొక్కలు, భా మనే సురేందర్‌ చేనులో రూ.8 లక్షల విలువైన 3.29 కిలోల 16 మొక్కలు, ప్రతాప్‌ సింగ్‌ చేనులో రూ.10 లక్షల విలువైన 4.08 కిలోల 20 గంజాయి మొక్కలను గుర్తించినట్లు తెలిపారు. వీటిన్నంటి వి లువ రూ.70 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు, పోలీసులు సమష్టిగా కృషి చేసి నిర్మల్‌ జిల్లా నుంచి గంజాయి మహమ్మారిని తరిమికొడదామని పిలుపునిచ్చారు. గంజాయి మత్తు పదార్థాలు విక్రయించినా, సేవించినా 87126 59555, 87126 59599లకు సమాచా రం ఇవ్వాలని సూచించారు. ఇన్‌చార్జి డీఎస్పీ ప్రభా కర్‌, ఖానాపూర్‌ సీఐ సైదారావు, కడెం ఎస్సై కృష్ణసాగర్‌, డాగ్‌స్క్వాడ్‌ సాయి, సీసీఎస్‌ సిబ్బంది తిరుపతి, గణేశ్‌, సతీశ్‌ను అభినందించారు.

గంజాయి మొక్కలు పరిశీలిస్తున్న ఎస్పీ జానకీ షర్మిల, ఇన్‌చార్జి డీఎస్పీ ప్రభాకర్‌

862 కిలోల గంజాయి ధ్వంసం..

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ జిల్లాలో ఇదివర కు నమోదైన 14 కేసుల్లో పట్టుబడిన 862 కిలోల గంజాయిని సోమవారం నిజామాబాద్‌ జిల్లాలోని జక్రాన్‌పల్లి వద్ద గల మెడికేర్‌ సర్వీస్‌ సెంటర్‌లో ధ్వంసం చేశారు. ప్రక్రియను పరిశీలించేందుకు జిల్లా ఎస్పీ గౌస్‌ ఆలం, కమిటీ సభ్యులు, డీసీఆర్‌బీ డీఎస్పీ సురేందర్‌ రెడ్డి, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌, డీసీఆర్‌బీ ఎస్సై హకీమ్‌లు వెళ్లారు. వారి సమక్షంలోనే ధ్వంసం చేశారు.

మాదకద్రవ్యాలు విక్రయిస్తే కఠిన చర్యలు

ఆదిలాబాద్‌టౌన్‌: గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని వన్‌టౌన్‌ సీఐ సునీల్‌ కుమార్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్‌, స్టేడియం సమీపంలో గల హోటళ్లు, పాన్‌షాపుల్లో నార్కొటిక్‌ స్నైపర్‌ డాగ్‌తో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మత్తు పదార్థాలతో అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయన్నారు. ఎక్కడైన గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిస్తే సమాచారం అందించాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. యువత మాదకద్రవ్యాలకు అలవాటుపడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. సీఐ వెంట ఎస్సై అశోక్‌, కానిస్టేబుళ్లు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
● రూ.70 లక్షల విలువైన మొక్కలు స్వాధీనం ● నిందితుల అరెస్1
1/1

● రూ.70 లక్షల విలువైన మొక్కలు స్వాధీనం ● నిందితుల అరెస్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement