ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
ఇచ్చోడ: మండలంలోని జున్ని గ్రామానికి చెందిన డొంగ్రె జ్ఞానేశ్వర్ (45) సోమవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. జ్ఞానేశ్వర్ గత కొన్ని రోజుల నుంచి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. సోమవారం ఉదయం 9 గంటలకు వ్యవసాయ పనులకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి పొలానికి వెళ్లాడు. సాయంత్రం వరకు కూడా ఇంటికి తిరిగి రాక పోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా చెట్టుకు ఉరేసుకుని కన్పించాడు. మృతుడు అన్న దేవిదాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఫొటోగ్రాఫర్ మృతి
కాగజ్‌నగర్‌రూరల్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణంలోని ఓల్డ్‌కాలనీకి చెందిన భీమనాథం జీవన్ (32) అనే ఫొటోగ్రాఫర్ మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న క్రమంలో వడ్ల లోడుతో వెళ్తున్న ఐచర్ వ్యాన్ మోటారు సైకిల్‌ను ఓవర్ టేక్ చేయబోయి ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్‌తో పాటు జీవన్ కిందపడిపోయి తీవ్ర రక్త స్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్సై దీకొండ రమేశ్ తెలిపారు. మృతుడి తమ్ముడు సాయిరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment