ఎదురెదురుగా ద్విచక్రవాహనాలు ఢీ
మందమర్రిరూరల్: మందమర్రి పట్టణంలోని సింగరేణి గ్రీన్‌పార్క్ సమీపంలో గల ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద సోమవారం ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనగా యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కెట్ నుంచి పాత బస్టాండ్ వైపు బైక్‌పై వెళ్తున్న భరత్, పాత బస్టాండ్ నుంచి మార్కెట్ వైపు స్కూటీపై వ స్తున్న అక్షయ్ ఎదురెదురుగా ఢీ కొన్నారు. దీంతో యువకులు కిందపడిపోగా వారికి తీవ్ర గా యాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 ద్వారా మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోప్రమాదంలో ఆర్టీసీ బస్సును బైక్ ఢీ కొనగా వాసు అనే యువకునికి తీవ్రగాయాలు కాగా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోండి
నిర్మల్‌టౌన్: పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లిన వ్యక్తిని స్వదేశానికి తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రవాస మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర నాయకులు స్వదేశ్ పరికిపండ్ల అన్నారు. సోమవారం బాధిత కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో మాట్లాడారు. ఖానాపూర్ మండలం గోడల పంపు గ్రామానికి చెందిన రాజేశ్వర్ గత 6 సంవత్సరాల క్రితం కూలీపని నిమిత్తం సౌదీఅరేబియా వెళ్లాడన్నారు. అయితే గత మూడేళ్లుగా అతని నుంచి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అతని ఆచూకీ తెలుసుకొని స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కుటుంబ సభ్యులు భార్య లక్ష్మి, కుమారులు సిద్దార్థ, మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment