షార్ట్ సర్క్యూట్‌తో దుకాణం దగ్ధం
ఖానాపూర్: పట్టణంలోని జీపుఅడ్డాలో గల కేసరి ఫ్యాషన్ రెడిమేడ్ బట్టల దుకాణంలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి 10 గంటల తర్వాత షార్ట్ సర్క్యుట్ కారణంగా ప్రమాదం చోటుచేసుకుందని దుకాణం యజమాని సుతారి రాజేందర్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఫైరింజన్‌కు సమాచారం ఇవ్వడంతో ఇన్‌చార్జి ఫైర్ అధికారి జావిద్ అలీ ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలు ఆర్పివేశారు. దుకాణంలోని బట్టలు, ఫర్నిచర్‌తో పాటు విద్యుత్ పరికరాలు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయని, దాదాపు రూ. 10లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. తనకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరాడు. సమాచారం అందిన వెంటనే ఎస్సై రాహుల్ సిబ్బందితో చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment