కడుపునొప్పి భరించలేక వివాహిత ..
మంచిర్యాలక్రైం: కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై రాములు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఏసీసీ క్రిష్ణకాలనీకి చెందిన అయిండ్ల శ్రీనివాస్ –హేమలత దంపతుల కుమార్తె రోషిని(22)కి బెల్లంపల్లి బూడిదబస్తీకి చెందిన ప్రేమ్‌కుమార్‌తో గత ఆగస్టులో వివాహం జరిగింది. ఆరోగ్యం బాగా లేదని గత నెల 27న భర్తతో కలిసి రోషిని పుట్టింటికి వచ్చింది. ఆదివారం ఇంట్లో అందరితో సరదాగా గడిపిన రోషిని సోమవారం తెల్లవారుజామున బిల్డింగ్ పైకి వెళ్తుండగా రెండో అంతస్తులో నివాసం ఉంటున్న ధర్మాజి రోషినిని పైకి ఎందుకు వెళ్తున్నావని ప్రశ్నించాడు. వాకింగ్ చేసేందుకు వెళ్తున్నాని చెప్పిన రోషిని కొద్ది సేపటికే కిందకు దూకింది. పెద్ద శబ్ధం రావడంతో కిందకు చూసిన ధర్మాజి వెంటనే రోషిని తండ్రికి సమాచారం అందించాడు. తీవ్ర రక్తపు మడుగులో ఉన్న రోషినిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment