● ఉమ్మడి జిల్లా ఫుడ్‌కంట్రోలర్ టి.నాయక్
ఆదిలాబాద్‌టౌన్: వసతిగృహాలు, పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఉమ్మడి జిల్లా ఫుడ్ కంట్రోలర్ టి.నాయక్ అన్నారు. ఇటీవల నిర్వహించిన ఫుడ్‌పాయిజన్ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో సమావేశ మందిరంలో హాస్టల్ వార్డెన్, సంక్షేమ అధికారులు, ఏఎన్‌ఎంలు, మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్‌పాయిజన్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా విద్యార్థులు భోజనం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అలాగే వంట చేసే సమయంలో, కిచెన్‌లో శుభ్రత పాటించాలన్నారు. నాసిరకం భోజనం వండిపెడితే చర్యలు తప్పవన్నారు. భోజన సమయంలో ఉపాధ్యాయులు, వార్డెన్ అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజలింగు, మధ్యాహ్న భోజన కార్మికులు, వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment