జోరుగా నాసిరకం సరుకుల విక్రయాలు
ఇచ్చోడ: నియోజకవర్గంలోని ఇచ్చోడ, నేరడిగొండ, బజార్‌హత్నూర్, సిరికొండ, గుడిహత్నూర్, బోథ్ మండలాల్లోని పలు రాజస్థాన్ స్వీట్‌హౌస్‌లకు ఆర్మూర్ ప్రాంతానికి చెందిన మరో రాజస్థాన్ వ్యాపారి నాసిరకం సరుకులు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఇచ్చోడ మండల కేంద్రంలో కొందరు స్థానికులు అడ్డుకోవడంతో నాసిరకం సరుకులు సరఫరా చేసే వ్యక్తులు వాహనంతో పరారయ్యారు. కొద్దిరోజులుగా ఈ దందా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆరు మండలాల్లో కొంతకాలంగా రాజస్థాన్‌కు చెందిన స్వీట్‌హౌస్‌లు, బేకరీల వ్యాపారులు నాసిరకం సరుకులు దిగుమతి చేసుకుని వాటితో తయారు చేసిన స్వీట్లు, ఇతర అహార పదార్థాలు సామన్య, మధ్యతగతి ప్రజలకు అంటగట్టి భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. స్వీట్‌హౌస్‌లు, బేకరీల్లో తనిఖీలు నిర్వహించకపోవడం కూడా వారికి కలిసివస్తోంది. సంబంధిత అధికారులు ఆకస్మీకంగా తనిఖీలు చేస్తే అసలు విషయం బయటకు పడే అవకాశముంది. నాసిరకం సరుకుల సరఫరాపై ఆదిలాబాద్ ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌ను వివరణ కోరగా, ఆకస్మీకంగా తనిఖీలు నిర్వహించి శాంపిళ్లు సేకరించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment