రాష్ట్రస్థాయి క్రీడల్లో రాణించాలి
మంచిర్యాలటౌన్: సీఎం కప్ పోటీల్లో రాష్ట్రస్థాయిలో రాణించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీ పక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్న త పాఠశాల మైదానంలో జిల్లా స్థాయి సీఎం కప్–2024 బాక్సింగ్, కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ క్రీడారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్ర త్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. క్రీ డా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వా రిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని పే ర్కొన్నారు. అదనపు కలెక్టర్ మోతిలాల్, జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధి కారి కీర్తిరాజ్ వీరు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, జెడ్పీ సీఈవో గణపతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment