సీఎంఆర్ పూర్తి చేయాలి
● నెలాఖరు వరకే గడువు ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: సీఎంఆర్, పెండింగ్ బకా యిలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం ఆయన కలెక్టరేట్ చాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్‌తో కలిసి జిల్లా అధికారులు, రైస్‌మిల్లర్లతో ధాన్యం సేకరణ, చెల్లింపులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రైస్‌మిల్లర్లు బకాయి ఉన్న రూ.93కోట్లు వెంటనే చెల్లించాల ని, ఈ నెలాఖరు వరకు నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చే యాలని అన్నారు. లక్ష్య సాధనలో నిర్లక్ష్యం వహిస్తు న్న మిల్లులపై డిఫాల్టర్లుగా ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మయ్య, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, పౌరసరఫరాల శాఖ మేనేజర్ శ్రీకళ పాల్గొన్నారు.
అర్హులకు పరిహారం
మంచిర్యాలఅగ్రికల్చర్: జాతీయ రహదారి–163జీ నిర్మాణంలో భూములు కోల్పోయిన అ ర్హులైన ప్రతీ ఒక్కరికి పరిహారం అందించే విధంగా చర్యలు తీ సుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మంచిర్యాల ఆర్డీవో కార్యాలయంలో జాతీ య రహదారి విస్తరణలో బాధితుల వివరాలను ఆర్డీవో శ్రీనివాస్ రావుతో కలిసి పరిశీలించారు.
పనులు వేగవంతం చేయాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ప్రభుత్వ వై ద్య కళాశాల నిర్మాణ పనులు వేగవంతం చే యాలని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బు ధవారం హాజీపూర్ మండలం గుడిపేటలో ప్ర భుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులను ఆ యన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య కళాశాలకు సొంత భవనా న్ని రూ.216 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. రోడ్లు, భవనాల శాఖ ఏఈఈ అనూష, కళాశా ల ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ సంపూర్ణరావు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment