విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలటౌన్: విద్యార్థులు చదువుతోపాటు క్రీ డల్లోనూ రాణించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సీఎం కప్–2024 పోటీల్లో భాగంగా గురువారం చెస్ పోటీలు ప్రారంభించారు. విద్యార్థులతో సరదాగా చెస్ ఆడారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ పోటీల విజయవంతానికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. జిల్లాస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఈ నెల 27నుంచి జనవరి 2వరకు రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపా రు. జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలని అన్నారు. క్రీడల వల్ల ఆరోగ్యంగా ఉండడంతోపాటు విద్య, ఉపాధి రంగాల్లో రాణించేందుకు ఏకాగ్రత పెరుగుతుందని చెప్పారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కీర్తి రాజ్‌వీరు, జిల్లా షెడ్యూల్డ్ కు లాల కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, పీడీలు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో గురువారం నిర్వహించిన పోటీల్లో విజేతల వివరాలను జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాజ్‌వీర్ ప్రకటించారు. చెస్ బాలుర విభాగంలో మందమర్రికి చెందిన ఆర్.మణిరశ్విత్, మంచిర్యాలకు చెందిన ఎం.ప్రహర్శవర్దన్, బాలికల విభాగంలో మంచిర్యాలకు చెందిన మాటేటి మణి, ఏ.అక్షయ విజేతలుగా నిలిచారని పేర్కొన్నారు. ఖోఖో బాలు ర విభాగంలో కోటపల్లి మొదటి స్థానం, చెన్నూర్ అర్బన్ రెండోస్థానం, బాలికల విభాగంలో వేమనపల్లి మండలం మొదటి స్థానం, మందమర్రి రెండోస్థానం కై వసం చేసుకున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment