సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డికి వినతి
తాండూర్/నెన్నెల/వేమనపల్లి: బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్, నెన్నెల, వేమనపల్లి, భీమిని మండలాల్లోని సమస్యలు పరిష్కరించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, చెన్నూర్ ఎమ్మెల్యే వినోద్ ఆధ్వర్యంలో ఆయా మండలాల నాయకులు గురువారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. తాండూర్ మండలానికి ప్రభుత్వ జూని యర్ కళాశాల, ఇండోర్ స్టేడియం మంజూరు చే యాలని, మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల కళాశాలకు సొంత భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. నెన్నెల–కోనంపేట రోడ్డు నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు ఇప్పించాలని, నెన్నెలలో జూనియర్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని డీసీసీ ఉపాధ్యక్షుడు సూరం రవీందర్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు చిలుముల శంకర్, తాండూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ ఈసా, మాజీ ఎంపీటీసీ సిరంగి శంకర్ కోరారు. వేమనపల్లిలో జూనియర్ కళాశాల నిర్మించాలని, మల్లంపేట నుంచి నీల్వాయి, వేమనపల్లి నుంచి నాగారం, కళ్లంపల్లి నుంచి మొట్లగుడం వరకు అటవీ శాఖ అనుమతులు ఇప్పించాలని, మామడ, కొత్తగూడం గ్రామాలకు 300 ఇళ్లు కేటా యించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాబీర్‌అలీ విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment