మాస్టర్ ప్లాన్ కోసమే డ్రోన్ ఏరియల్ సర్వే
● కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపాలిటీలో సమగ్ర మాస్టర్ ప్లాన్ కోసం డ్రోన్ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో గురువారం రీజనల్ డిప్యూ టీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వరంగల్‌కు చెందిన అధికారులతో కలిసి కలెక్టర్ డ్రోన్ ఏరియల్ సర్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని నివాస, వాణిజ్య, వ్యవసాయ భూముల గుర్తింపు, అభివృద్ధి ఇతర అంశాల పరిశీలన కోసం డ్రోన్ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని మున్సిపాలిటీలు వేగంగా అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సర్వేలో భాగంగా అమృత్ 2.0 సంబంధించి నివేదిక అందిన అనంతరం మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేసి సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చేందుకు ప్రతి పాదనలు ఉన్నందున డ్రోన్ ఏరియల్ సర్వే ద్వారా భూముల సమాచారం సేకరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో గణపతి, షెడ్యూల్డ్ కు లాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు పోటు రవీందర్‌రెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కీర్తి రా జ్వీరు, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ నీరటి రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ మారుతిప్రసాద్, టౌన్ కంట్రీ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment