‘ఆదర్శ’ం ఆహ్వానిస్తోంది..!
● మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ● జనవరి 6 నుంచి 28 వరకు..
కుంటాల: గ్రామీణ పేద విద్యార్థులకు కార్పొరేట్‌స్థాయి విద్య అందించాలన్న సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటయ్యాయి. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యాబోధన చేస్తున్నారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో పాఠశాలల్లో చేరేందుకు పోటీ పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 14 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. 2025, జనవరి 6 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది.
దరఖాస్తుల ఆహ్వానం..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 ఆదర్శ పాఠశాలలో ఉండగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జనవరి 6 నుంచి ఫిబ్రవరి 28 వరకు www. telanganams.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో 1400 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు మిగిలి ఉన్న ఖాళీల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ధ్రువపత్రాలను పాఠశాలల్లో అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 2025, ఏప్రిల్ 13న అర్హత పరీక్ష నిర్వహిస్తారు.
కేటగిరీల వారీగా..
ఆదర్శ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతిలో దరఖాస్తుల చేసుకునేవారికి కేటగిరీ వారీగా విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగ విద్యార్థులు రూ.125, ఓసీ విద్యార్థులకు రూ.200 ఫీజు చెల్లించాలి.
సద్వినియోగం చేసుకోవాలి..
ఆదర్శ పాఠశాలల్లో ఉత్తమ బోధనతో మంచి ఫలితాలు సాధిస్తున్నాం. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – నవీన్ కుమార్, ప్రిన్సిపాల్, ఆదర్శ పాఠశాల, కుంటాల
Comments
Please login to add a commentAdd a comment