విద్యార్థులకు చదువుకునే స్వేచ్ఛ ఇవ్వాలి
లోకేశ్వరం: విద్యార్థులను తల్లిదండ్రులు క్రమం త ప్పకుండా పాఠశాలకు పంపించాలని, వారికి చదువుకునే స్వేచ్ఛ ఇవ్వాలని విద్యాశిక్షణ పరిశోధన సంస్థ(ఎన్‌సీఈఆర్‌టీ) ఢిల్లీ ప్రొఫెసర్ సుశీల్‌కుమార్ తివారి అన్నారు. మండలంలోని రాజూర, మన్మద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యాప్రవేశ పరీక్షలు, పాఠశాలలను శనివారం సందర్శించారు. ఒకటో తరగతి విద్యార్థులతో డ్రాయింగ్ వేయించారు. సుశీల్‌కుమార్ తివారీ మాట్లాడుతూ పిల్ల లపై అనవసర లక్ష్యాలను రుద్ది ఒత్తిడిని పెంచొద్దని సూచించారు. మొదటి తరగతి విద్యార్థులతో ఉపాధ్యాయులు మమేకమై మాట్లాడిస్తూ, నవ్విస్తూ బోధించాలని తెలిపారు. ఆయన వెంట ఏఎంవో నర్సయ్య, ఎన్‌సీఈఆర్‌ఐ ముత్తన్న, ఏఏపీసీ చైర్‌పర్సన్ సరస్వతి, వీడీసీ చెర్మన్ ప్రవీణ్, మాజీ సర్పంచ్ ముత్తగౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ పోతన్న ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment