ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
మంచిర్యాలఅర్బన్: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాని టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు. బుధవారం మంచిర్యాలలో టీపీటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ పెండింగ్ బిల్లులు, డీఏలు విడుదల చేయాలని, 317 జీవో ద్వారా స్థానికత కోల్పోయిన టీచర్లకు న్యాయం చేయాలని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి భుజంగరావు మాట్లాడుతూ సమగ్రశిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టీపీటీఎఫ్ హైదరాబాద్‌లో నిర్వహించే ధర్నా విజయవంతం చేయాలన్నారు.
జిల్లా కార్యవర్గం ఎన్నిక
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) జిల్లా నూతన కమిటీని బుధవారం ఎన్నికల పరిశీలకుడు, రాష్ట్ర కార్యదర్శి భుజంగరావు ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా పోడేటి సంజీవ్, ప్రధాన కార్యదర్శిగా మనోజ్, ఉపాధ్యక్షులుగా గాజుల శంకర్, వెంకట్రాజమ్మ, పెద్ది లక్ష్మణ్, కార్యదర్శులుగా వెంకటస్వామి, స్వర్ణలత, ప్రవీణ్, సమ్మయ్య, కమలహసన్ ఎన్నికున్నారు.
Comments
Please login to add a commentAdd a comment