దాడి చేసిన వారిని శిక్షించాలి
మంచిర్యాలటౌన్: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కాప్రా మండల ఆర్‌ఐలపై దాడిని తాము తీ వ్రంగా ఖండిస్తున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి డిమాండ్ చేశారు. జి ల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్‌లో బుధవా రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న కాప్రా మండల ఆర్‌ఐ లు రమేశ్, సాయిలపై దాడి చేయడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఉద్యోగులపై దా డులు చేయడం సరికాదని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఉన్నతాధికారులను సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాల ని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జి ల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, రాష్ట్ర కా ర్యదర్శి పున్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు శ్రీని వాస్, రామ్‌కుమార్, తిరుపతి, అంజయ్య, సంయుక్త కార్యదర్శులు సునిత, ప్రభు, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రావణ్ కుమార్, యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment