‘వేతనాల కోతను వ్యతిరేకిస్తున్నాం’
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలో ఆడిట్ పేరిట అధికారులు కార్మికుల మస్టర్లు, వేతనంలో కోత విధిస్తున్నారని, ఇలాంటి చర్యలను గుర్తింపు కార్మిక సంఘం వ్యతిరేకిస్తుందని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం ఏరియాలోని కేకే–5 గనిపై ఆయన మాట్లాడారు. అండర్ గ్రౌండ్‌లో పనిచేసే కార్మికులు అవసర నిమిత్తం ఉపరితలంలోఽ విధులు నిర్వర్తిస్తే వారి లైట్ ఆధారంగా ఆడిట్ అధికారులు మస్టర్‌లో కోతఽ విధించడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ విషయమై ఏరియా అధికారులు కల్పించుకోవా లని, లేకుంటే కోర్టుకు వెళ్లి జరిగిన అన్యాయంపై పోరాడుతామని హెచ్చరించారు. యూనియన్ నాయకులు, గని ఫిట్ కార్యదర్శి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment