ప్రైవేటు లాడ్జీల యజమానులపై కేసు
బాసర: బాసరలోని ప్రైవేటు లాడ్జీల యజమానులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు భైంసా ఏఎస్పీ అవినాష్‌కుమార్ తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ ఇటీవల అసాంఘిక కార్యకలాపాలకు పాల్ప డిన లాడ్జి ఓనర్‌తో పాటు లీజుకు తీసుకున్న మరో లాడ్జి ఓనర్‌పై పోక్సో చట్టం కింద ఒకటి హైదరాబాద్‌లో, బాసరలో మరొకటి వేర్వేరుగా కేసులు నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆలయం వద్ద ఉన్న ప్రైవేటు లాడ్జీలను తనిఖీ చేశా రు. రిజిస్టర్లు, అద్దె గదులను పరిశీలించి గుర్తు తెలి యని వ్యక్తులకు అద్దెకు ఇవ్వవద్దని లాడ్జి యజమానులకు సూచించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే లాడ్జి యజమానులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ మల్లేశ్, ఎస్సై గణేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment