ఆస్పత్రిని శుభ్రం చేసిన మందుబాబులు
నస్పూర్: ఇటీవల డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన మందుబాబులచే మంగళవారం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రి, పరిసరాలు శుభ్రం చేయించినట్లు సీసీసీ నస్పూర్ ఎస్సై సుగుణాకర్ తెలిపారు. డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఐదుగురిని సోమవారం మంచిర్యాల కోర్టులో హాజరుపర్చగా మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఉపనిషధ్వని వారికి డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు మంచిర్యాల ఆస్పత్రి ని శుభ్రం చేయించే పనులు కేటాయించాలని తీర్పునిచ్చారన్నారు. జడ్జి తీర్పు మేరకు మరో రెండు రోజులు వారిచే ఆస్పత్రిని శుభ్రం చేయిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment