14 నుంచి జుగ్నాక్ వంశీయుల పెర్సపేన్ పూజలు
ఇంద్రవెల్లి: మండలంలోని పొల్లుగూడ గ్రామంలో ఈనెల 14 నుంచి పెర్సపేన్ పూజలు నిర్వహించనున్నట్లు జుగ్నాక్ వంశం కటోడ(పూజారి) జుగ్నాక్ మహాదు అన్నారు. గ్రామంలో శనివారం ఉమ్మడి జిల్లా జుగ్నాక్ వంశం పెద్దలతో ఆయన సమావేశమయ్యారు. పూజల నిర్వహణ గురించి చర్చించారు. 15న పెర్సపేన్ పూజలు నిర్వహించి గ్రామం చుట్టూ ప్రదక్షిణ చేస్తారని తెలిపారు. 16న కుల దేవతకు పుణ్యస్నానం ఆచరించడంతోపాటు అదేరోజు రాత్రి మహాపూజ ఉంటుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా జుగ్నాక్ వంశీయులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. జుగ్నాక్ వంశీయులు జుగ్నాక్ కాశీరాం, మానిక్‌రావ్, భారత్, జాలింరావ్, గ్రామపెద్దలు ఆత్రం శంకర్, భుజంగ్‌రావ్, కొరెంగా జుగాదిరావ్, మర్సుకోల నాందేవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment