బైక్ పైనుంచి కార్మికుడు మృతి
శ్రీరాంపూర్: అదుపుతప్పి బైక్‌పై నుంచి పడి సింగరేణి కార్మి కుడు మృతి చెందాడు. సీసీసీ నస్పూ ర్ ఎస్సై సుగుణాకర్ కథనం ప్రకారం.. తీగల్‌పహడ్ ఏరియాలోని అల్లూరి సీతారామరాజునగర్‌లో నివాసం ఉండే గడికొప్పుల రాజేశ్(32) ఆర్కే 6 గనిలో జనరల్ మజ్దూర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం బెల్లంపల్లిలోని మిత్రుడు వద్దకు వెళ్లి కలిసి తన బైక్‌పై ఇంటికి బయల్దేరాడు. అర్ధరాత్రి ఎన్‌హెచ్ 363 సీసీసీ నస్పూర్ ఫ్‌లైఓవర్ నుంచి సర్వీసు రోడ్డుకు దిగుతూ బైక్ అదుపుతప్పి కాలువలో పడ్డాడు. తలకు తీవ్రయాగాలై అక్కడికక్కడే మృతిచెందాడు. శనివారం ఉదయం హైవే పెట్రోలింగ్ సిబ్బంది చూసి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెళ్లి చూసే అప్పటికే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇసయ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment